దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్య కేసు.. OTT రిలీజ్

by Kavitha |   ( Updated:2024-01-29 15:08:27.0  )
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్య కేసు.. OTT రిలీజ్
X

దిశ, సినిమా: నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా సినిమాలు తీయడం ఎప్పటి నుండో ఉన్న ఆనవాయితీ. అలా వచ్చిన చిత్రాలు చాలానే ఉన్నాయి. ఇక ఈ OTT లు అందుబాటులో వచ్చిన తర్వాత నిజ జీవితంలో జరిగిన హత్యలకు సంబంధించిన కేసు లను కూడా సిరీస్‌లుగా, ఎపిసోడ్స్ వైస్‌గా తీసి రిలీజ్ చేస్తున్నారు.

ఇందులో భాగంగా షీనా బోరా హత్య కేసు దేశ వ్యాప్తంగా ఎంతటి అలజడి సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కేసును డాక్యుమెంటరీ రూపొందించారు. కాగా ప్రముఖ ఓటీటీ ప్లాఫ్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ ‘షీనా బోరా’ హత్య కేసుకు సంబంధించిన డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తాజాగా నెట్‌ఫ్లిక్‌ అధికారికంగా ప్రకటించింది.. ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: బరీడ్‌ ట్రూత్‌’ పేరుతో ఫిబ్రవరి 24 నుంచి ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాష‌ల్లో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్‌ కానుంది.

Read More..

మెగాస్టార్ చిరంజీవిని కలిసిన టీమిండియా స్టార్ క్రికెటర్




Advertisement

Next Story