పొగ మంచులో చిక్కుకున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్..

by sudharani |   ( Updated:2022-11-29 10:01:43.0  )
పొగ మంచులో చిక్కుకున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్..
X

దిశ, వెబ్‌డెస్క్: అచ్చతెలుగు ఆడపడుచులా.. పక్కింటి అమ్మాయిలా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన అలనాటి నటి శోభన గురించి తెలిసిందే. పెద్ద పెద్ద హీరోల సరసన నటించి అప్పటిలోనే తన నటనకు, అందానికి ఎంతో మందిని ఆకట్టుకుంది. ప్రస్తుతం నటనకు దూరంగా ఉంటున్న ఈమె.. క్లాసికల్ డాన్స్ క్లాసులు చెబుతూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యాక్టీవ్‌గా ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా తాను మంచులో చిక్కుకు పోయినట్లు ఓ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. వివరాల్లోకి వెళితే..

శోభన తాజాగా ప్రసిద్ధ ఫుణ్యక్షేత్రమయిన కేదార్ నాథ్ దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఈ యాత్రలో భాగంగా అక్కడి వాతా వరణం గురించి చెబుతూ.. ఓ వీడియోను షేర్ చేసింది. ''ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంది. పొగ మంచు కారణంగా నాకు జలుబు కూడా చేసింది. పైగా దట్టమైన పొగ మందచే కారణంగా హెలికాఫ్టర్ కూడా లేట్ అయింది. దాని కోసమే ఎదురు చూస్తున్న'' అంటూ చెప్పుకొచ్చింది.

Dj Tillu 2:'.. Anupama Parameswaran ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed