- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘హనుమాన్’ సినిమాకు మొదటి అవార్డు.. డైరెక్టర్ ట్వీట్ వైరల్
దిశ, సినిమా: యంగ్ హీరో తేజా సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘హనుమాన్’. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ బడా బడా హీరోల సినిమాలకు సైతం గట్టి పోటీ ఇస్తూ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టి రికార్డులు సృష్టించింది. అంతే కాకుండా ఇటీవల ఓటీటీలో రిలీజై అక్కడ కూడా గ్లోబల్ వన్ ట్రెండింగ్‌గా దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీకి మొదటి అవార్డు అందుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.
‘హనుమాన్’ చిత్రానికి బెస్ట్ డైరెక్టర్ అవార్డు రావడంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. అంతే కాకుండా ‘థాంక్యూ రేడియో సిటీ’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. ఇలాంటి అవార్డులు మున్ముందు ఇంకా ఎన్నో అందుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా.. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ‘జై హనుమాన్’, ‘ఆక్టోపస్’ అనే సినిమాలతో బిజీగా ఉన్నారు.