- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sir Movie: ధనుష్ ‘సార్’ సినిమా ను .. గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఫ్రీగా చూపించిన మూవీ యూనిట్..
దిశ, సినిమా: తమిళ స్టార్ ధనూష్ హీరోగా, డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరక్కెకిన తాజా చిత్రం ‘సార్’. మంచి అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 17న గ్రాండ్‌గా రిలీజై, మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని, బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ల రాబడుతుంది. చదువు కొనకూడదు’ అంటూ విద్యకు ఉన్న ప్రాధాన్యతను ఈ సినిమాలో చక్కగా చూపించారు, అలాగే కార్పొరేట్ విద్యా సంస్థల అక్రమాలు కూడా కళ్లకు కట్టినట్లు చూపించారు అట్లూరి. ఈ క్రమంలో చదువుకున్నే ప్రతి ఒక్కరు ఈ మూవీని చూడాలి అన ఉద్దేశంతో, ప్రముఖ మల్టిప్లెక్స్ సంస్థ పీవీఆర్‌తో కలిసి ఓ మంచిపనికి శ్రీకారం చుటింది చిత్ర యూనిట్. హైదరాబాద్ లోని పలు గవర్నమెంట్ పాఠశాలలోని దాదాపు 500 మంది విద్యార్థుల కు ఈ ‘సార్’ సినిమా ను ఉచితంగా చూపించారు. దీంతో పాటు విద్యార్థులకు ఫ్రీగా పాప్ కార్న్, కూల్ డ్రింక్స్, బెలూన్స్ కూడా అందించారు మూవీ యూనిట్.. ప్రస్తుతం ఈ స్కూల్ పిల్లలు, ధియెటర్లో చేసిన సందడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.