‘RRR’ రికార్డ్‌ను బద్దలు కొట్టిన ‘బలగం’ సినిమా..

by Hamsa |   ( Updated:2023-05-19 12:03:18.0  )
‘RRR’ రికార్డ్‌ను బద్దలు కొట్టిన ‘బలగం’ సినిమా..
X

దిశ, వెబ్ డెస్క్: జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి తెరకెక్కించిన ‘బలగం’ వరల్డ్ వైడ్‌గా సెన్సేషన్స్‌ను క్రియోట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అసలు ఏమాత్రం అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతేకాకుండా ఓటీటీలోను విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇందులో దీని గురించి చెబుతూనే కుటుంబం అంతా బలగంలా కలిసుండాలనే సందేశాన్ని చాలా చక్కగా కన్వే చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి విశేషాదరణ లభించింది. ఇటీవల టీవీల్లో ప్రసారమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూశారు. దీంతో ఓ విషయంలో బలగం, ఆర్ఆర్ఆర్ రికార్డ్‌ను బద్దలు కొట్టినట్లు సమాచారం. బుల్లితెరపై బలగం సినిమా 22 టీఆర్‌పీ రేటింగ్‌తో ఏకంగా ‘ఆర్ఆర్‌ఆర్’ను బద్దలు కొట్టింది. ఈ చిత్రానికి గతంలో టీవీల్లో ప్రసారం చేస్తే 19 రేటింగ్ మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది.

Read more:

Bichgadu 2: బిచ్చగాడు 2 పబ్లిక్ టాక్ (వీడియో)

Advertisement

Next Story