- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మరోసారి రిపీట్ కానున్న తండ్రీకొడుకుల జోడి.. ఈసారి గెస్ట్ రోల్ కాదంట..!
దిశ, సినిమా : టాలీవుడ్ నటులు, తండ్రీకొడుకులు చిరంజీవి-రామ్ చరణ్‌లకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ మేరకు చరణ్ తన తదుపరి మూవీ ఆర్సీ16 దర్శకుడు బుచ్చిబాబుతో చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే, స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్, గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కే ఈ సినిమాలో రామ్ చరణ్ కోచ్‌గా చిరంజీవి నటించబోతున్నట్లు తెలుస్తోంది. స్పోర్ట్స్‌లో హీరోకు మెళకువలు నేర్పే పాత్రకు ఎవరిని తీసుకుందామనే ఆలోచన చేస్తుండగా.. చిరు అయితే ఆ పాత్రకు బాగుంటుందని చిత్ర యూనిట్ చర్చించారు.
అందుకు మెగాస్టార్ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. అదేవిధంగా ఇంతకు ముందు తండ్రీకొడుకులు ఇద్దరు కలిసి నటించిన సినిమాల్లో ఎవరో ఒకరు గెస్ట్ రోల్‌కే పరిమితమయ్యారు. కానీ, బుచ్చిబాబు డైరెక్షన్‌లో వచ్చే సినిమాలో మాత్రం మెగాస్టార్ ఫుల్ రోల్‌లో కనిపించనుండగా, ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో మూవీ ప్రారంభం కానుందని సమాచారం. ఇక ఈ ప్రాజెక్ట్ మొదలు కాకముందే సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి.
ఇవి కూడా చదవండి : రేపు పవర్ ప్యాక్ సర్ ప్రైజ్.. ఇక అభిమానులకు జాతరే..