Uruku Patela Movie: నిర్మాతగా మారిన ' హుషారు ' హీరో తేజస్ తండ్రి.. 'ఉరుకు పటేల' అంటూ ఎంకరేజ్మెంట్..

by Prasanna |
Uruku Patela Movie: నిర్మాతగా మారిన  హుషారు  హీరో తేజస్ తండ్రి.. ఉరుకు పటేల అంటూ ఎంకరేజ్మెంట్..
X

దిశ, సినిమా: హుషారు వంటి వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ తేజ‌స్ కంచ‌ర్ల‌.. ‘ఉరుకు పటేల’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ‘గెట్ ఉరికిఫైడ్’ ట్యాగ్ లైన్‌ తో వస్తున్న సినిమాను లీడ్ ఎడ్జ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై కంచర్ల బాల భాను నిర్మించగా.. వివేక్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వహించారు. కాగా ఈ మూవీ టీజర్ లాంచ్ కార్యక్రమానికి హీరో అడవి శేషు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శుభాకాంక్షలు అందించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మూవీ హీరో.. ‘మా టీజర్‌ను లాంచ్ చేసిన అడివి శేష్ కు థాంక్స్. మంచి కంటెంట్ ఇవ్వాలని కాస్త టైం తీసుకున్నాను. మా నాన్నను చాలా కష్టపెట్టాను. ప్రవీణ్ లక్కరాజు మంచి సంగీతాన్ని ఇచ్చారు. ఆగస్ట్ నుంచి పాటల్ని రిలీజ్ చేస్తాం. మా దర్శకుడు వివేక్ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. కాఫీ షాప్, బార్ షాప్ ఇలా ఎక్కడ పడితే అక్కడ కూర్చుని చర్చించుకునే వాళ్లం' అని అన్నారు.

ఇక దర్శకులు మాట్లాడుతూ.. టీజర్ లాంచ్ చేసిన అడవి శేష్ కు థాంక్స్ చెప్పారు. మూవీ అందరికీ నచ్చుతుందని, మా మొదటి పటేల్ నిర్మాత అయితే రెండో పటేల్ హీరో అని చెప్పుకొచ్చారు. కాగా ఈ సందర్భంగా మాట్లాడిన నిర్మాత .. ‘ఇది మా మొదటి సినిమా. లీడ్ ఎడ్జ్ పిక్చర్స్ మీద మా అబ్బాయి తేజస్‌తో ఈ చిత్రాన్ని తీస్తున్నాం. వివేక్ మంచి కథను రాశారు. అందరూ ఆదరించండి’ అని ప్రేక్షకులను కోరారు.

Advertisement

Next Story