కాకి ట్రెండ్.. టాలీవుడ్‌ను విజయాల బాటపట్టిస్తోన్న నయా సెంటిమెంట్

by sudharani |
కాకి ట్రెండ్.. టాలీవుడ్‌ను విజయాల బాటపట్టిస్తోన్న నయా సెంటిమెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం టాలీవుడ్‌లో కాకులు చాలా కీలకంగా మారాయి. సినిమాలో కాకీ సీన్ ఉందంటే ఆ మూవీ కచ్చితంగా హిట్ కొడుతుంది. ఒక కాకిని చూపించి హిట్స్ సొంతం చేసుకుంటున్నారు దర్శకులు. ఈ క్రమంలోనే కాకిని కీలకంగా చూపించి మూడు సినిమాలు సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. అవేంటో చూద్దాం..

బలగం: దర్శకుడు వేణు అత్యంత అద్భుతంగా తీసిన సినిమా ‘బలగం’. ఓ చిన్న స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాలో కాకి ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాకి పిండం తినే కాన్సెప్ట్ మీద ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

విరుపాక్ష: సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా ‘విరుపాక్ష’. ఈ మూవీ కూడా ప్రస్తుతం మంచి టాక్‌తో ముందుకు దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాలో కూడా కాకి కీలకం అని తెలుస్తుంది. ‘విరుపాక్ష’లో బ్లాక్ మ్యాజిక్ గురించి చూపించారు. బ్లాక్ మ్యాజిక్‌ను రిప్రెజెంట్ చేస్తూ కాకులను చూపించారు. ఇక ఈ సినిమా కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంది.

దసరా: ఇక లాస్ట్ అండ్ ఫైనల్‌గా దసరా. నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో కూడా కాకి పిండం తినడం చూపిస్తారు. అది కూడా ఓ కీలక మలుపుల ఉంటుంది. ఇక ఈ సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇక.. ఈ సీన్లతో టాలీవుడ్‌లో ప్రస్తుతం కాకుల సెంటిమెంట్ ట్రెండ్ అవుతుందని చెప్పొచ్చు.

Advertisement

Next Story