నో బెయిల్.. ఇకపై ఆ స్టార్ హీరో జీవితం సెంట్రల్ జైలుకే పరిమితమా?

by Anjali |
నో బెయిల్.. ఇకపై ఆ స్టార్ హీరో జీవితం సెంట్రల్ జైలుకే పరిమితమా?
X

దిశ, సినిమా: కన్నడ నటుడు దర్శన్ తూగుదీప... రేణుస్వామి హత్య కేసులో ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఖైదీగా ఉన్నాడు. ఈ హీరో భార్య దర్శన్ ను బయటకు తీసుకొచ్చేందుకు శత ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవల హత్య కేసులో భాగమైన వారందరినీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ముందు జులై 24 వ తేదీన హాజరుపరిచారు. న్యాయమూర్తి నిందితులందరి పేర్లే పలుకగా.. చేతులు పైకెత్తి వచ్చి న్యాయమూర్తి ముందు నిలబడ్డారు. విచారణ అనంతరం 14 వ తారీకు వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి విశ్వనాథ్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. నిందితుల సాక్ష్యాధారాల సేకరణ పెండింగ్‌లో ఉందని, వీరికి బెయిల్ వస్తే సాక్షాలను నాశనం చేసే అవకాశం ఉందని, మళ్లీ హీరో దర్శన్ కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉందని.. పోలీసుల పలు వాదనలు విన్న కోర్టు నిందితులకు బెయిల్ ఇవ్వకుండా.. వచ్చే నెల వరకు తేదీ పొగిగించింది. దీంతో పలువురు నెటిజన్లు ఈ హీరో పరిస్థితి సెంట్రల్‌కే పరిమితమా ఏంటి? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story