రజాకార్లు ఒక కులాన్నే టార్గెట్ చేయలేదు.. పోస్టర్ వివాదం!

by GSrikanth |   ( Updated:2023-07-16 13:48:21.0  )
రజాకార్లు ఒక కులాన్నే టార్గెట్ చేయలేదు.. పోస్టర్ వివాదం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ‘రజాకార్’ సినిమా పోస్టర్‌ను హైదరాబాద్‌లోని జలవిహార్‌లో జులై 14వ తేదీన మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, ఎంపీ బండి సంజయ్, తదిర ప్రముఖులు హాజరై పోస్టర్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా పోస్టర్‌పై కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా పోస్టర్‌పై నెటిజన్లు పలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘ఆనాడు రజాకార్లు ఒక కులం అంటూ టార్గెట్ చేయలేదు. ఎక్కువగా రెడ్లు, దళితులే బలయ్యారు. చాకలి ఐలమ్మ స్థానంలో వేరే ఎవరినో చూపించినా ఆశ్చర్య పొనక్కరలేదు. ఎలక్షన్ల కోసం, వేడిలో వేడిగా డబ్బు చేసుకోవడం కోసం ఈ పాట్లు’ అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ‘‘భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ లేదు, తెలంగాణ సాయుధ పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్ లేదు. 1969 తెలంగాణ ఉద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్ లేదు. 2001 నుంచి 2014 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్ లేదు. రజాకార్ల మీద పోరాటం చేసింది రెడ్డి, వెలమ & దళితులు (కమ్యూనిస్టులు)’’ అంటూ మరోక నెటిజన్ కామెంట్స్ చేశారు.

మరోవైపు ఇలాంటి కామెంట్లకు మరో వర్గం కూడా కౌంటర్ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా పోస్టర్ సమయంలో బీజేపీ నేత బండి సంజయ్‌‌ మాట్లాడుతూ.. కశ్మీర్ ఫైల్స్ సినిమా చూసిన తర్వాత పాతబస్తీ ఫైల్స్ తీయాలని గూడూరు నారాయణరెడ్డికి సూచించానని, అదే సమయంలో రజాకార్ ఫైల్స్‌‌ పై చర్చ జరిగిందని, చివరకు రజాకార్ సినిమాను తీయాలని నిర్ణయించారని తెలిపారు. సమర్‌ వీర్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం 'రజాకార్‌', ఈ సినిమాలో బాబీ సింహా, వేదిక, అనిష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్‌ దేశ్‌ పాండే నటీనటులుగా ఉన్నారు.

Advertisement

Next Story