రామ్ చరణ్‌ను ఫ్రీగా వాడేసుకుంటున్న కంపెనీ.. పాపం ఎప్పుడు తెలుసుకుంటారో..

by Shiva |   ( Updated:2023-09-02 13:19:54.0  )
రామ్ చరణ్‌ను ఫ్రీగా వాడేసుకుంటున్న కంపెనీ.. పాపం ఎప్పుడు తెలుసుకుంటారో..
X

దిశ, సినిమా : శ్రీరెడ్డి మరోసారి మెగా ఫ్యామిలీపై సెటైర్స్ వేసింది. ముఖ్యంగా రామ్‌ చరణ్‌ పాప్ గోల్డెన్ అవార్డ్స్‌కు నామినేట్ కావడాన్ని ఆస్కార్ కాదు భాస్కర్ అవార్డుకు ఎంపిక అవుతాడని విమర్శించింది. నిజానికి పాప్ గోల్డెన్ కంపెనీకి 50 మంది సబ్ స్క్రైబర్స్ కూడా లేరని.. వికీ, ఐడీఎంబీ, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇందుకు సంబంధించిన డీటెయిల్స్ లేవని ట్వీట్ చేసింది. కానీ చెర్రీ ఫ్యాన్స్ మాత్రం ఏదో గొప్ప పని చేశాడని పండగ చేసుకుంటున్నారని రాసుకొచ్చింది. మొత్తానికి అమీర్ పేట్‌లో తయారు చేసిన ఒక వెబ్‌సైట్ లాంటి కంపెనీకి చరణ్ నామినేట్ కావడం నిజంగానే చాలా గ్రేట్ అని సెటైర్ వేసింది శ్రీరెడ్డి.

Advertisement

Next Story