పాన్ ఇండియన్ మూవీకి బ్రేక్ వేసిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది

by Dishaweb |   ( Updated:2023-06-21 15:38:32.0  )
పాన్ ఇండియన్ మూవీకి బ్రేక్ వేసిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎలాంటి పాత్రనైనా అలవోకగా పండించే నాట్య నటరాజు కమల్ హాసన్. తన దశవాతారాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షక ఆదరణ పొందారు ఆయన. తాజాగా శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఇండియన్-2' . ఈ సినిమాను మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రేకులు పడుతూనే ఉన్నాయి.

అయితే ‘ఇండియన్-2' చిత్రబృందానికి చెన్నై ఎయిర్ పోర్ట్ సిబ్బంది ఊహించని షాక్ ఇచ్చింది. చెన్నై విమానాశ్రయంలో కమల్ హాసన్ పై కొన్ని కీలక సన్నివేశాలు చేస్తుండగా.. ఎయిర్ పోర్ట్ నిర్వాహాకులు షూటింగ్ మధ్యలోనే ఆపేసినట్టు తెలుస్తోంది. ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాలు, డిపార్చర్ ఏరియాలో మాత్రమే షూటింగ్‌కు పర్మిషన్ ఇచ్చారట. కానీ అక్కడ ఇతర ఏరియాలో షూటింగ్ చేస్తుండడంతో ఆపాల్సిన పరిస్థితి వచ్చినట్లు తెలుస్తోంది.

ఒకప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్‌లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ఒకటి ఇండియన్. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా ఇండియన్ 2 అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ శంకర్. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ, ప్రియా భవాని శంకర్, గుల్షన్ గ్రోవర్, సముద్రఖని, బాబీ సింహా తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Chandramukhi 2 : ‘చంద్రముఖి 2’ షూటింగ్ కంప్లీట్.. రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Advertisement

Next Story