Prabhas- Imanvi: ఫస్ట్ టైమ్ వయసులో చిన్న హీరోయిన్‌తో రొమాన్స్.. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉందంటే?

by Hamsa |   ( Updated:2024-08-18 14:27:29.0  )
Prabhas- Imanvi: ఫస్ట్ టైమ్ వయసులో చిన్న హీరోయిన్‌తో రొమాన్స్.. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉందంటే?
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది నటించిన ఆదిపురుష్ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఈ సినిమా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన నటించిన సలార్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో పాటుగా కలెక్షన్ల పరంగా బాగానే రాబట్టాడు. ఇక జూన్ 27న విడుదలైన కల్కి సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అంతేకాకుండా భారీ కలెక్షన్స్ రాబట్టి పలు రికార్డులు సాధించింది. ప్రస్తుతం డార్లింగ్ రెండు చిత్రాలు సలార్-2, కల్కి-2 లైన్‌లో పెట్టాడు. మారుతీ డైరెక్షన్‌లో రాబోతున్న రాజాసాబ్ మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. అంతేకాకుండా ఇటీవల హను రాఘవపూడి సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టాడు.

ఇక ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. అలాగే షూటింగ్ తొందరలోనే స్టార్ట్ కాబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఇందులో పాకిస్తాన్ హీరోయిన్ ఇమాన్వి ఇస్మాయిల్‌‌ను హీరోయిన్‌లో సెలెక్ట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక గత రెండు రోజుల నుంచి ఇమాన్వికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో మార్మోగిపోతున్నాయి. ఆమె డ్యాన్సర్, నటి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని తెలిసి అంతా షాక్ అవుతున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా, ప్రభాస్, ఇమాన్వి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇమాన్వి వయసు 29 ఏళ్లు కాగా ఇక ప్రభాస్ ఏజ్ 45. అంటే వీరిద్దరి మధ్య దాదాపు 16 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. ఆసక్తికర విషయమేంటంటే.. టాలీవుడ్ స్టార్ హీరోలు ఇంతకన్నా చిన్న వయసు అమ్మాయిలతో నటించినప్పటికీ ప్రభాస్ మాత్రం అంత ఏజ్ గ్యాప్ ఉన్న హీరోయిన్‌తో నటించడం ఇది మొదటిసారి అని సమాచారం. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది తెలిసిన వారు అయినప్పటికీ ఆమె చాలా క్యూట్‌గా ఉంది ప్రభాస్ పక్కన బాగుందని అంటున్నారు.


Read more...

ఆ గుణమే విజయాలిస్తోంది.. రెబల్ స్టార్ ప్రభాస్‌పై CM రేవంత్ ప్రశంసల వర్షం

Advertisement

Next Story