‘గుంటూరు కారం’నుంచి పూజా హెగ్దే‌ తప్పుకోవడంపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత నాగవంశీ

by Hamsa |   ( Updated:2023-10-03 10:03:33.0  )
‘గుంటూరు కారం’నుంచి పూజా హెగ్దే‌ తప్పుకోవడంపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత నాగవంశీ
X

దిశ, సినిమా: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఇందులో మెయిన్‌ హీరోయిన్‌గా పూజా హెగ్దే, సెకండ్ హీరోయిన్‌గా శ్రీలీలను సెలక్ట్ చేసినప్పటికీ పూజ మూవీనుంచి తప్పుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించిన నిర్మాత నాగవంశీ.. ‘పూజకు ఓ హిందీ చిత్రంలో నటించాల్సివుంది. డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె ప్లేస్‌లో మీనాక్షి చౌదరిని తీసుకున్నాం. అంతే తప్పా మరో కారణం లేదు. మహేశ్‌బాబు ఈ సినిమాలో భిన్నంగా కనిపిస్తాడు. సంక్రాంతికి పక్కాగా విడుదల చేస్తాం. త్వరలోనే ఫస్ట్ సింగిల్ వస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

Read More: సల్మాన్ ఖాన్ ఆరోగ్యానికి ఏమైంది..?

Advertisement

Next Story