- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Amani: ఆ కారణంగానే సౌందర్య అన్నను పెళ్లి చేసుకోలేదు.. సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్!
దిశ, సినిమా: అలనాటి స్టార్ హీరోయిన్ ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చాలా మంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఆమని.. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఏ మాత్రం తగ్గకుండా అమ్మ, వదిన, అత్తా పాత్రలో ఈ భామ నటిస్తూ అలరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు అలనాటి సౌందర్య గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఆమె మాట్లాడుతూ.. “నేను సుందర్య చాలా క్లోజ్‌గా ఉండేవాళ్ళం.. అలాగే వాళ్ల ఫ్యామిలీతోనూ చాలా సన్నిహితంగా ఉండేదాన్ని. ఈ క్లోజ్‌నెస్ కారణంగా ఒకసారి సౌందర్య వల్ల నాన్న నన్ను తన కొడుకు అమర్‌ను(సౌందర్య అన్నయ్య) పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. దాంతో నేను, సౌందర్య షాక్ అయ్యి.. ఒక నిమిషం అర్ధం కాక ఒకరి మొహం ఒకరు చూసుకున్నాం. నేను వెంటనే సౌందర్యకు తన సోదరుడికి కాలేజ్‌లో ఓ లవ్ స్టోరీ ఉందని.. అది మీ నాన్నకు తెలియదని మెసేజ్ చేశా. కాగా సౌందర్య వాళ్ల నాన్న చనిపోయిన తర్వాత అమర్ తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంటూ ఆమని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.