రాడిసన్ డ్రగ్స్ కేసులో నేను ఇరుక్కోవడానికి కారణం అదే.. నిహారిక ఆసక్తికర కామెంట్స్

by Hamsa |   ( Updated:2024-03-17 07:36:11.0  )
రాడిసన్ డ్రగ్స్ కేసులో నేను ఇరుక్కోవడానికి కారణం అదే.. నిహారిక ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక ఇటీవల భర్తతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి వెబ్‌సిరీస్, సినిమాలు నిర్మిస్తూ.. నిర్మాతగా ఫుల్ బిజీ అయిపోయింది. అంతేకాకుండా పలు ఇంటర్వ్యూలో పాల్గొంటూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. అలాగే సినిమాల్లో హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇచ్చి ఓ తమిళ చిత్రంలో ఆఫర్ కొట్టేసింది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ పలు ఫొటోల వల్ల ట్రోల్స్ ఎదుర్కొంటుంది.

ఇదిలా ఉండగా తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక పెళ్లికి ముందు జరిగిన రాడిసన్ బ్లూ పబ్ ఘటన గురించి స్పందించి అసలు విషయాన్ని బయట పెట్టింది. ‘‘రాడిసన్ డ్రగ్స్ కేసులో నన్ను అన్యాయంగా ఇరికించారు. నేను పబ్‌లకు ఎక్కువగా వెళ్లను. కానీ ఆరోజు నా మా స్కూల్ ఫ్రెండ్స్‌ను కలవడానికి వెళ్లాను. 6 నెలల తర్వాత మేమంతా కలిసాము. కాసేపు అక్కడే ఉండి మాట్లాడుకున్నాము. కానీ అక్కడ సౌండ్స్ వల్ల ఇబ్బంది అనిపించడంతో బిల్లు కట్టి వెంటనే వెళ్ళిపోదామని అనుకున్నాము. బయటకు వెళ్తున్న సమయంలోనే పోలీసులు వచ్చారు. దీంతో అందరితో పాటు మమ్మల్ని కూడా స్టేషన్‌కు తీసుకుని వెళ్లారు.

దీనిపై మీడియా నానా రచ్చ చేసి రకరకాల వార్తలు రాశారు. అప్పుడు నాకేం అర్థం కాలేదు. నా తప్పు లేని దానికి అలా రాయడం చూసి చాలా బాధేసింది. ఆ తర్వాత దాని గురించి తెలిసింది. పబ్‌లో కొందరు డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు అందుకే అందరినీ అరెస్ట్ చేశారని. అప్పుడే తెలుసుకున్నాను నేను తప్పుడు ప్రదేశంలో ఉన్నానని లేట్‌గా అర్థం చేసుకున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా, తొందరలో నిహారిక ఓ తమిళ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Read More..

చరణ్‌‌లో అదోక్కటి నాకు చాలా ఇంష్టం.. ‘రజాకార్’ నటి వైరల్ కామెంట్స్

Advertisement

Next Story