మహేష్ బాబు నాకు ఇచ్చిన మొదటి బహుమతి అదే.. నమ్రతా కామెంట్స్ వైరల్

by Hamsa |   ( Updated:2023-08-18 07:41:31.0  )
మహేష్ బాబు నాకు ఇచ్చిన మొదటి బహుమతి అదే.. నమ్రతా కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నమ్రతా పెళ్లి తర్వాత సినిమాలు మానేసి మహేష్ బాబు బిజినెస్‌లతో పాటు పిల్లలను కూడా చూసుకుంటుంది. కాలీ సమయం దొరకినప్పుడల్లా నిత్యం కుటుంబమంతా కలిసి వేకేషన్స్‌కు వెళ్తూ ఎంజాయ్ చేస్తారు.

తాజాగా, ఓ జ్యువెల్లరీ షాప్ ఓపెనింగ్‌కు వెళ్లిన నమ్రతా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘ నాకు పెద్దగా నగలు ఇష్టముండదు. చాలా వరకు సింపుల్‌గానే ఉండటాన్ని ఇష్టపడతాను. షాపింగ్ కూడా అంత నచ్చదు. నాకు మహేష్ బాబు నాకు ఇచ్చిన మొదటి బహుమతి వెడ్డింగ్ రింగ్. నేను ఇప్పటికీ అందుకున్న ఉత్తమమైన బహుమతులలో ఒకటి మా అమ్మ ఇచ్చిన బంగారం ఉంగరం. 8 ఏళ్ల వయసులో మా అమ్మ నాకు సాయిబాబా ఉంగరం ఇచ్చింది. ఇప్పటికీ నేను దాన్ని ధరిస్తున్నాను. ఇకపోతే మహేష్‌బాబుతో కలిసి నటించబోతున్నా, రీఎంట్రీ ఇవ్వనున్నానంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నమ్రత కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారింది.

Read More: కన్నీరుమున్నీరు అవుతున్న మహేశ్ బాబు భార్య, కూతురు.. పోస్ట్ వైరల్

నీవు అలా చూపిస్తే కుర్రాళ్లకు హార్ట్ ఎటాక్ లే.. థైస్ షోతో పిచ్చెక్కించిన ప్రగ్వా

Advertisement

Next Story