ఎన్టీఆర్‌ని డౌన్ ఫాల్ చేసేందుకు ఆ టీం భారీ కుట్ర.. కారణం అదేనా!

by Kavitha |   ( Updated:2024-05-20 10:52:57.0  )
ఎన్టీఆర్‌ని డౌన్ ఫాల్ చేసేందుకు ఆ టీం భారీ కుట్ర.. కారణం అదేనా!
X

దిశ, సినిమా: తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ ఆర్ ఆర్ (RRR) సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘వార్ 2’ సినిమాలో కూడా ఎన్టీఆర్ నటిస్తున్నారు.

అయితే సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్ బాగా ట్రోల్ చేస్తున్నారు జనాలు. తాజాగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా విషయంలో సైతం అదే ట్రోలింగ్ ఎదుర్కొనేలా చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోయే సినిమాకి సంబంధించిన మూవీ టైటిల్ కి రిలేటెడ్ గా ఒక న్యూస్ వైరల్ అయింది. వీళ్ళిద్దరి కాంబోలో రాబోతున్న మూవీకి డ్రాగన్ అనే పవర్ఫుల్ టైటిల్ పెట్టారు అంటూ వార్తలు వినిపించాయి. మరో రెండు రోజుల్లో ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా దీనికి సంబంధించిన అఫీషియల్ టైటిల్ రివీల్ చేయబోతున్నారు .

కాగా ఇప్పుడు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కి షాక్ ఇస్తూ అశ్వత్ మారి ముత్తు మేకర్స్ డ్రాగన్ పేరుతో మరొక మూవీని ప్రకటించారు. ఈ సినిమాలో నటించే నటీనటుల డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ కాస్త వైరల్ గా మారింది. కావాలనే ఎన్టీఆర్ ని ఇరికించడానికి కొందరు ఇలా చేస్తున్నారు అంటూ, మరికొందరు ఎక్కడినుంచి దాపురిస్తారు రా మీరు అంటూ ఫ్యాన్స్ ఘాటుగా స్పందిస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ ని డౌన్ ఫాల్ చేసేందుకు ఓ టీం భారీగానే కుట్ర చేస్తుంది అంటూ ప్రచారం చేస్తున్నారు.

Click Here For Twitter Post..

Advertisement

Next Story