ఆ కథకు శృంగార సన్నివేశం చాలా అవసరం.. జాన్వీ కపూర్ కామెంట్స్ వైరల్

by Kavitha |   ( Updated:2024-05-08 05:52:34.0  )
ఆ కథకు శృంగార సన్నివేశం చాలా అవసరం.. జాన్వీ కపూర్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: అతిలోక సుందరి శ్రీదేవి నటిమని కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందం మరియు అభినయానికి ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే. మత్తెక్కించే కళ్ళ తో కుర్రకారు మనసులు దోచుకుంటుంది. శ్రీదేవి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్లో స్థిరపడింది.

ప్రస్తుతం జాన్వీ కపూర్ టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ‘దేవర’ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే జాన్వీ కపూర్ తెలుగులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది. ఈ అమ్మడు తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ బిజీగా ఉంటూ తన హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేస్తుంది.

ఇదిలా ఉండగా, బాలీవుడ్‌ మీడియాలో జాన్వీకపూర్‌ నటిస్తున్న 'మిస్టర్‌ అడ్‌ మిసెస్‌ మహి' సినిమా గురించి రచ్చ జరుగుతుంది. ఈ సినిమాలో హౌస్‌వైఫ్‌‌గా జాన్వీకపూర్‌, భర్తగా రాజ్‌కుమార్‌రావు విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. భార్య భర్తల బంధం ఎలా ఉండాలో అనే నేపథ్యంతో పాటు క్రీడా నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని సమాచారం. అయితే.. కథ డిమాండ్‌ మేరకు ఇందులో ఓ శృంగార సన్నివేశం గురించి దర్శకుడు శరన్‌శర్మ జాన్వీకి వివరిస్తే, ఆమె ససేమిరా అన్నదట. కానీ దర్శకుడు నచ్చజెప్పడంతో జాన్వీకి తప్పలేదట. దీనిపై ముంబయ్‌ మీడియాలో రకరకాలుగా కథనాలు ప్రసారమయ్యాయి. వీటిపై జాన్వీ స్పందిస్తూ 'కథకు ఆ సన్నివేశం అవసరం. రోల్‌ డిమాండ్‌ మేరకే నటించాను. ఎక్కడా బోల్డ్‌గా లేకుండా భార్యాభర్తల ప్రేమ మాత్రమే అందులో కనిపించేలా కళాత్మకంగా శరన్‌శర్మ ఆ సన్నివేశాన్ని తీర్చిదిద్దారు. నటిగా ఈ సినిమా నాకు ఛాలెంజ్‌.' అని చెప్పింది. అయితే ఈ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది.

Advertisement

Next Story