- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్ కల్యాణ్ ఫస్ట్ లవ్ అదేనట.. విడిచిపెట్టి ఉండలేక ఉదయం లేవగానే పక్కలో ఉంచుకుని ముద్దులు!
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ గత కొద్ది కాలంగా రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించి ప్రజల సమస్యలు తీరుస్తున్నారు. అయితే పవన్ గత కొద్ది కాలంగా సినిమాలకు దూరం అయ్యారు. కానీ షూటింగ్ మధ్యలో ఆపేసిన వాటిని తొందరలోనే కంప్లీట్ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా, పవన్ కల్యాణ్ ఫస్ట్ లవ్‌కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో భాగంగా పవన్ కల్యాణే స్వయంగా ఈ విషయాన్ని తెలపడంతో.. మరోసారి ఆయన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఫస్ట్ లవ్ అంటే అందరూ అమ్మాయి అనుకుంటున్నారేమో కానీ కాదు.
పవర్ స్టార్ ఫస్ట్ లవ్ ఓ రివాల్వర్ అని తెలుస్తోంది. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను మొదట్లో రివాల్వర్‌ను ఇష్టపడ్డాను. ఈ విషయం గమనించిన మా అన్నయ్య ఎక్కడ ఉద్యమాల్లోకి వెళతానో అని కొనిస్తే ఇంట్లోనే ఉంటాడని అనుకున్నాడు. దీంతో వెంటనే కొనిచ్చాడు. అయితే నా ఉద్దేశం అది కాదని చెప్పాలనుకున్నాను.. కానీ చెప్పలేకపోయాను. ఎవరైనా తప్పు చేస్తే రివాల్వర్‌తో సమాధానం చెప్పాలనే ఆలోచన ఉండేది అందుకే అదంటే చాలా ఇష్టం.
ఇక మా అన్నయ్య కొనిచ్చిన రివాల్వర్ నేను ఒక్కసారి కూడా విడిచిపెట్టి ఉండలేకపోయాను. ప్రతిరోజు నేను నా జేబులో పెట్టుకుని తిరిగేవాడిని. అంతేకాకుండా నిద్రపోతుంటే పక్కలో పెట్టుకుని ఉదయం నిద్ర లేవగానే ముద్దులు కూడా పెట్టాను. అదే నా ఫస్ట్ లవ్. ఇంట్లో అందరికంటే ఎక్కువగా ఎవరు ఇష్టం అంటే.. మా అన్నయ్య కొనిచ్చిన రివాల్వర్ మీద పిచ్చి అని చెప్పేవాడిని. నిజం చెప్పాలంటే నా ఫస్ట్ ఎఫైర్ అన్నయ్య కొనిచ్చిన రివాల్వర్ తోనే’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పవన్ కామెంట్స్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.