విడుదలకు ముందే అరుదైన ఘనత దక్కించుకున్న ‘థాంక్యూ ఫర్ క‌మింగ్’!

by Anjali |   ( Updated:2023-09-13 10:25:05.0  )
విడుదలకు ముందే అరుదైన ఘనత దక్కించుకున్న ‘థాంక్యూ ఫర్ క‌మింగ్’!
X

దిశ, సినిమా : భూమి పెడ్నేకర్ న‌టించిన తాజా చిత్రం ‘థాంక్యూ ఫర్ క‌మింగ్’ విడుదలకు ముందే అరుదైన ఘనత దక్కించుకుంది. రైజ్, రెబ‌ల్, రిపీట్ అనే ట్యాగ్ లైన్‌తో కరణ్ బూలానీ తెరకెక్కించిన మూవీ ఈ ఏడాది టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన ఏకైక భారతీయ సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ మేరకు సెప్టెంబ‌ర్ 8 నుంచి 17 వరకూ కెనడాలో టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ (TIFF) జ‌రుగ‌నుండగా ఈ వేదికపై ‘థాంక్యూ ఫర్ క‌మింగ్’ సినిమాను ప్రదర్శించనున్నట్లు ఫిల్మ్ క్రిటిక్ తరణ్ అర్జున్ ట్వీట్ చేశాడు.

మహిళల కోణం నుంచి సెక్స్‌వ‌ల్ రిలేష‌న్‌షిప్స్ ఎలా ఉంటాయనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో వస్తున్న మూవీలో షెహనాజ్ గిల్, అనిల్ కపూర్, కుషా కపిల, నటాషా రస్తోగి సైతం ప్రధాన పాత్రలు షోషించారు. ఇక ఇప్పటికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టీజ‌ర్, ట్రైల‌ర్‌, ఫ‌స్ట్ సింగిల్ ప్రేక్షకుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకోగా అక్టోబర్ 6న సినిమా విడుదలకానుంది.

Read More: సమంత విడాకులకు మద్యం మత్తే కారణమా..? ఆ రాత్రి అలా జరగకపోతే.. ఫిల్మ్ నగర్ టాక్ ఇదే..?

Advertisement

Next Story