ఇన్‌స్టాగ్రామ్‌కు ఎంట్రీ ఇచ్చిన దళపతి విజయ్.. నిమిషాల్లో లక్షల మంది ఫాలోవర్స్

by sudharani |   ( Updated:2023-04-02 11:19:45.0  )
ఇన్‌స్టాగ్రామ్‌కు ఎంట్రీ ఇచ్చిన దళపతి విజయ్.. నిమిషాల్లో లక్షల మంది ఫాలోవర్స్
X

దిశ, సినిమా : ఇళయ దళపతి విజయ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి అఫిషియల్ ఎంట్రీ ఇచ్చాడు. actorvijay పేరుతో ఉన్న హ్యాండిల్‌లో ‘లియో’ మూవీ లుక్‌లో ఉన్న ఫొటో షేర్ చేస్తూ ‘హలో నంబాస్ అండ్ నంబీస్’ అంటూ పోస్ట్ పెట్టాడు. ఇలా ఎంటర్ అయ్యాడో లేదో అలా లక్ష మంది ఫాలోవర్స్ అతన్ని ఫాలో అయిపోతుండగా.. ఇక్కడ కూడా రికార్డుల మోతమోగించేలా ఉన్నాడని అంటున్నారు అభిమానులు. 24 గంటల్లో మోస్ట్ ఫాలోడ్ ఇండియన్ సెలబ్రెటీగా రికార్డులు బ్రేక్ చేయడం ఖాయం అని ఖుష్ అవుతున్నారు. ఫొటోలో బ్యూటిఫుల్ స్మైల్‌ను చూసి ఫిదా అయిపోతున్న ఫ్యాన్స్.. ఇన్‌స్టాగ్రామ్‌కు తలపతిగ్రామ్‌గా పేరు మార్చొచ్చు కదా అంటున్నారు.

Also Read.. సినిమాల విషయంలో కిచ్చా సుదీప్ కీలక నిర్ణయం.. ట్వీట్ వైరల్


Advertisement

Next Story