సోఫియా క్యారెక్టర్‌పై నటి షాకింగ్ కామెంట్స్.. బయటకు కనిపించినంత గొప్పదేం కాదంటూ

by samatah |   ( Updated:2023-08-01 07:54:31.0  )
సోఫియా క్యారెక్టర్‌పై నటి షాకింగ్ కామెంట్స్.. బయటకు కనిపించినంత గొప్పదేం కాదంటూ
X

దిశ, సినిమా: అమెరికన్ స్టార్ యాక్ట్రెస్ సోఫియా వెర్గారా మనస్తత్వం బయటకు కనిపించినంత గొప్పదేం కాదంటోంది నటి థెరిసా గియుడిస్. ఇటీవలో ఓ పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె.. తనకు తెలిసిన హాలీవుడ్ నటీమణుల నిజ జీవితాల గురించి మాట్లాడింది. ఈ మేరకు సొంత ఇళ్లలో ఉన్నపుడు గృహిణులుగా తమ పాత్రను పోషించేవారు చాలా తక్కువమందే ఉన్నారని చెప్పింది. ఈ క్రమంలోనే తాను కలుసుకున్న అత్యంత మొరటు మహిళ సోఫియానేనంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘2017లో జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ విషయాన్ని బలంగా చెప్పగలను. నేను ఆమె ప్రవర్తనను దగ్గరినుంచి మొత్తం చూశాను. ఓసారి ఉండలేక ‘నువ్వు మాతో చాలా అణుకువగా ఉన్నావనుకుంటున్నావ్. కానీ, ఇతరుల పట్ల మొరటుగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించుకోలేకపోతున్నావ్. నువ్వు ఎక్కడినుంచి వచ్చావో మరిచిపోయావా’ అని సోఫియాకు తన గతాన్ని గుర్తుచేసినట్లు తెలిపింది.

Read More: Ketika Sharma: కేతిక శర్మ అందాలు కెవ్వు కేక

Advertisement

Next Story

Most Viewed