Katrina Kaif: కత్రినా కైఫ్ దగ్గర రూ.5 కోట్లు అప్పు చేసిన తెలుగు స్టార్ హీరో.. ?

by Prasanna |   ( Updated:2023-11-28 05:54:22.0  )
Katrina Kaif: కత్రినా కైఫ్ దగ్గర రూ.5 కోట్లు అప్పు చేసిన తెలుగు స్టార్ హీరో.. ?
X

దిశ,వెబ్ డెస్క్: తెలుగు చలనచిత్ర పరిశ్రమ ద్వారా పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి వరుసగా సూపర్ హిట్లు అందుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అలాంటి వారిలో కత్రినా కైఫ్ కూడా ఒకరు. మల్లీశ్వరి మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడం తో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ నుంచి వరుస అవకాశాలు వచ్చాయి. ఇదిలా ఉండగా.. ఈ క్రేజీ హీరోయిన్ గురించి సోషల్ మీడియా లో ఓ వార్త హల్చల్ చేస్తుంది. దక్షిణాదిలో సినిమాలు తక్కువే చేసినప్పటికీ కొంతమంది స్టార్ హీరోలతో మాత్రం బాగా క్లోజ్ గా ఉండేదట. పార్టీల్లో కూడా కలుస్తుండటంవల్ల పరిచయాలన్నీ మంచి స్నేహంగా మారాయి.

అప్పట్లో కుర్ర హీరో ఒక సినిమాని నిర్మించాడు. హీరోగా కూడా ఆయనే నటించాడు. దీనికి సంబంధించి రివ్యూలు మంచిగా వచ్చినప్పటికీ కమర్షియల్ గా సినిమా మంచి వసూళ్లను రాబట్టలేకపోయింది. ఫైనాన్సర్స్ కి తిరిగి డబ్బులు ఇచ్చేందుకు ఆ సమయం లో ఆ హీరో దగ్గర ఒక్క రూపాయి కూడా లేదట. ఎవరిని అడగాలో తెలియక కత్రినా కైఫ్ ని 5 కోట్ల రూపాయిలు డబ్బులు సర్దమని అడిగాడంట. అడిగిన వెంటనే ఆమె రూ.5 కోట్లు ఇచ్చింది. అయితే ఇప్పటివరకు ఆ కుర్ర హీరో ఐదుకోట్ల రూపాయల్లో ఒక్క రూపాయిని కూడా కత్రినాకు తిరిగివ్వలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది.

Advertisement

Next Story