- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇండస్ట్రీలో మగాళ్లు కూడా లైంగిక వేధింపులకు గురవుతారు: Ankit
దిశ, సినిమా : ప్రముఖ టెలివిజన్ నటుడు అంకిత్ గుప్తా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవలే 'బిగ్‌బాస్' షో నుంచి ఎలిమినేట్ అయిన ఆయన రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. లైంగిక వేధింపులు ప్రతి రంగంలోనూ ఉన్నాయని, అయితే ఈ సమస్య కేవలం మహిళలే కాదు పురుషులు కూడా ఎదుర్కొంటున్నారని చెప్పుకొచ్చాడు. 'సినీ పరిశ్రమలో నిజాయితీగా ఉంటే అవకాశాలు ఇవ్వరని చాలామంది చెప్పారు. పెద్ద సినిమా, సీరియల్స్‌లో చాన్స్ కావాలంటే కాంప్రమైజ్ అవ్వాల్సిందేనని బలవంతం చేశారు కూడా. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ల గురించి చెబుతూ వారంతా కాంప్రమైజ్ అయినా వాళ్లేనని, అలా చేస్తేనే స్టార్లుగా ఎదిగారని నమ్మించే ప్రయత్నం చేశారు. అయినా నేను అలాంటి వాడిని కాదు. ఇష్టంలేని పనిని ఎప్పుడూ ఒప్పుకోలేదు. ఒకసారి షూటింగ్‌లో భాగంగా ఓ వ్యక్తి నా పక్కనే కూర్చొని నా శరీరాన్ని తడమడం మొదలుపెట్టాడు. నేను దూరం జరుగుతుంటే 'కనీసం ఒక్కసారైనా ముట్టుకోనివ్వు' అంటూ దారుణంగా బిహేవ్ చేశాడు. నా జీవితంలో ఎదురైన చెత్త అనుభవం అదే. అప్పటినుంచి పురుషులు కూడా లైంగికంగా వేధించబడతారని అర్థమైంది' అంటూ వివరించాడు.
Also Read...