ప్రభాస్ ఫ్యాన్స్‌కు తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్

by Satheesh |   ( Updated:2023-12-19 14:43:24.0  )
ప్రభాస్ ఫ్యాన్స్‌కు తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉన్న సలార్ సినిమా బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చింది. తెలంగాణ, హైదరాబాద్‌లో డిసెంబర్ 22వ తేదీ ఉదయం 1 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షోలకు అనుమతినిస్తూ ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బెనిఫిట్ షోలతో పాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు కూడా ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. మల్టీప్లెక్స్‌లలో గరిష్టంగా రూ.100 పెంచుకునేందుకు అనుమతి.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.65 పెంచుకునేందుకు పర్మిషన్‌ ఇచ్చింది. తమ హీరో సినిమా బెనిఫిట్ షోలకు అనుమతినిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రభాస్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

Advertisement

Next Story