‘హనుమాన్’ సినిమాకు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే సపోర్ట్

by GSrikanth |
‘హనుమాన్’ సినిమాకు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే సపోర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ సంక్రాంతి పండక్కి తెలుగులో విడుదలకు చాలా సినిమాలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా నాగార్జున, వెంకటేశ్, మహేశ్ బాబు వంటి అగ్రహీరోల సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. వీటితో పాటు యువ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన ‘హనుమాన్’ సినిమా కూడా విడుదల కానుంది. అయితే, నాలుగు సినిమాలు విడుదల కానుండటంతో థియేటర్ల డిస్ట్రిబ్యూషన్‌లో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. హనుమాన్ సినిమాకు మద్దతు ఇవ్వడం మన బాధ్యత అని పేర్కొన్నారు.

హనుమాన్ వంటి చిత్రాలు మన దేశానికి, హిందూ మతం గొప్పతనానికి గుర్తింపునిస్తాయని చెప్పారు. శ్రీరాముడి ప్రత్యేక భక్తుడు అయిన హనుమంతుడి ఆశీర్వాదం పొందిన ఓ అదృష్ట యువకుడి కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇలాంటి గొప్ప ప్రయత్నం అందరూ తప్పకుండా అండగా నిలబడాలని కోరారు. కాగా, హనుమాన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ టికెట్‌పై రూ.5 లను అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ చిత్రబృందాన్ని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. జనవరి 12న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Advertisement

Next Story