నిహారికతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన తరుణ్.. కుండ బద్దలు కొట్టేశాడుగా

by Anjali |   ( Updated:2023-08-02 09:41:38.0  )
నిహారికతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన తరుణ్.. కుండ బద్దలు కొట్టేశాడుగా
X

దిశ, సినిమా: టాలీవుడ్ లవర్ బాయ్ తరుణ్ గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో అద్భుతమైన చిత్రాలతో అలరించిన ఈ హీరో కొన్నాళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. అయితే గత కొద్ది రోజులుగా తరుణ్ పెళ్లి చేసుకోబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. అది కూడా ఏకంగా మెగా ఇంటికి అల్లుడు కాబోతున్నడనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా ఈ విషయంపై తరుణ్ క్లారిటీ ఇచ్చాడు. ‘నా పెళ్లిపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నిజంగా ఏదైనా శుభవార్త చెప్పాలనుకుంటే సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా ముఖంగా నేనే వెల్లడిస్తాను. నా పెళ్లి విషయంలో ఈ పుకార్లు ఎందుకు పుట్టుకొస్తున్నాయో తెలియడం లేదు’ అని క్లారిటీ ఇచ్చాడు.

Advertisement

Next Story