- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
NTR: అమెరికా నుంచి తిరిగొచ్చిన తారక్ .. సక్సెస్ మీట్ కోసమేనా?
దిశ , వెబ్ డెస్క్ : దేవర మూవీ మిక్స్డ్ టాక్ నడుస్తుంది.. ఇంకో వైపు కలెక్షన్స్ భారీగా వసూలు చేస్తుంది. రోజు రోజు కి టాక్ మారడంతో కలెక్షన్స్ ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. దేవరకి తెలుగులో గట్టి ప్రమోషన్స్ చేసి ఉంటే ఈ రోజు రిజల్ట్ వేరేలా ఉండేది. ఎన్టీఆర్ స్టార్ డం, అతని నటన వలన ఎంతో మంది థియేటర్స్ వద్దకి వెళ్ళి సినిమాని చూస్తున్నారు. మూడు రోజుల్లో రూ. 304 కోట్ల గ్రాస్ వసూలు చేసిన 500 కోట్ల టార్గెట్ దిశగా వెళ్తుంది.
ప్రమోషన్స్ మీద ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లిన విషయం మనకీ తెలిసిందే. ఎన్టీఆర్ ఈ రోజు హైదరాబాద్ కి తిరిగొచ్చారు. ఉదయం హైద్రాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్, భార్య ప్రణతి వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
సక్సెస్ మీట్ కోసమే ఇండియాకి వచ్చారంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫెయిల్ అయింది.. ఇప్పుడు దేవర సక్సెస్ మీట్ పెట్టండంటూ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ను స్పెషల్ గా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏపీలో దీని కోసం ఓపెన్ గ్రౌండ్ చూస్తున్నట్టు తెలిసిన సమాచారం.