ఎన్‌టీఆర్ అభిమానులకు బిగ్ షాక్.. 'NTR 30' ఇప్పట్లో లేనట్లే?

by Javid Pasha |   ( Updated:2023-02-20 11:19:07.0  )
ఎన్‌టీఆర్ అభిమానులకు బిగ్ షాక్.. NTR 30 ఇప్పట్లో లేనట్లే?
X

దిశ, సినిమా : యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ అభిమానులకు మరోసారి నిరాశే మిగిలింది. కొరటాల శివ తెరకెక్కించబోతున్న ప్రాజెక్ట్ 'NTR 30' మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పట్టాలెక్కడం ఆలస్యమైన మూవీని మరోసారి పోస్ట్‌పోన్ చేసినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. 'ఆచార్య' ఫలితంతో కొరటాల శివ టేకింగ్ మీద అనుమానం వ్యక్తం చేసిన తారక్.. కొత్త కథ మీద దృష్టిపెట్టాలని పట్టుబట్టాడట. పాన్ ఇండియాకు సరిపడా కథను సెట్ చేసేందుకు కొంచెం శ్రమించని కోరాడని సమాచారం.

దీంతో హీరో చెప్పినట్లే స్టోరీని తీర్చిదిద్దిన కొరటాల.. ఎట్టకేలకు ఈ వారంలోనే షూటింగ్ మొదలు పెడదామని సంబరపడ్డాడు. కానీ, తారకరత్న అనారోగ్యం కారణంగా సినిమా ఇప్పుడు ప్రారంభించడం సరైంది కాదని తారక్ చెప్పినట్లు తెలుస్తోంది. అంతలోనే తన అన్నయ్య మరణించడంతో పుట్టెడు దు:ఖంలో ఉన్న ఎన్‌‌టీ‌ఆర్ వీలు చూసుకుని కొరటాలకు కబురు పెడతానని చెప్పినట్లు సమాచారం. కాగా ఈ వార్తలతో ఫీల్ అవుతున్నారు తారక్ ఫ్యాన్స్.

Advertisement

Next Story