- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ లో అగ్ని ప్రమాదం
దిశ, మేడిపల్లి : మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం చెంగిచర్లలో ఘోరం జరిగింది. రంజిత్ కుమార్, శశిధర్ కుమార్ లకు చెందిన నూతనంగా షిఫ్ట్ చేసిన ఫ్రాంక్లిన్ ఈవీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎలక్ట్రిక్ బైక్ గోదాంలో శనివారం షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుంది. దాంతో గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సిబ్బంది ఆర్పే ప్రయత్నం చేయగా మంటలు గోదాం మొత్తం అలుముకున్నాయి.
దాంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. రెండు ఫైర్ ఇంజన్లతో సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు. సంఘటనా స్థలానికి మేడిపల్లి సీఐ గోవింద రెడ్డి, బోడుప్పల్ కమిషనర్ రామలింగం, కార్పొరేటర్లు తదితరులు చేరుకుని పర్యవేక్షిస్తున్నారు. సంఘటనకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఓనర్ బంధువు నవీన్ మాట్లాడుతూ ఈ రోజే ఇక్కడకు షిఫ్ట్ అవుతున్నామని, కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయని, రూ.8 కోట్ల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపారు.