బైక్‌పై ప్రపంచ యాత్ర చేయబోతున్న తమిళ స్టార్ హీరో.. ఇది రెండోసారి!

by Aamani |
బైక్‌పై ప్రపంచ యాత్ర చేయబోతున్న తమిళ స్టార్ హీరో.. ఇది రెండోసారి!
X

దిశ, వెబ్‌డెస్క్ : అభిమానులు ‘తల’ అని పిలుచుకునే తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌ ఇటీవల ఇండియాలోని కొన్ని ప్రధాన నగరాలు, పట్టణాలతో పాటు భూటాన్, నేపాల్ దేశాలకు బైక్‌పై వెళ్లారు. అజిత్ కుమార్‌కు బైకులన్నా, బైక్ రేసులన్నా మహా పిచ్చట.. సినిమాల నుంచి బ్రేక్ దొరికినప్పుడల్లా బైక్‌పై స్నేహితులతో కలిసి టూర్లకు వెళ్తుంటారట.. ఇప్పుడు తన రెండో ప్రయత్నంగా ప్రపంచ యాత్ర చేయబోతున్నారు. ఈ ప్రపంచ యాత్ర నవంబర్ నుంచి మొదలుకాబోతోంది. బైక్ మీద అజిత్‌ ప్రపంచ యాత్ర చేయనున్నట్లు అత‌ని మేనేజర్ సురేష్ చంద్ర ట్విట్టర్‌లో తెలిపాడు. ఈ సాహస యాత్ర కోసం అజిత్ ఓ తమిళ సినిమా షూటింగ్‌ను చాలా వేగంగా పూర్తి చేశారు.

కాగా అజిత్ తన 62వ సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. మగిళ్ తిరుమేని దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తు్ంది. అక్టోబర్ నాటికి ఈ సినిమా షూటింగ్‌ను పూర్తిచేసి నవంబర్‌లో అజిత్ ప్రపంచ యాత్రకు వెళ్ళనున్నారని సమాచారం.

Advertisement

Next Story