- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Simbu : రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించిన తమిళ్ హీరో శింబు
దిశ, వెబ్ డెస్క్ : అకాల వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన భారీ వరదలకు విజయవాడ, ఖమ్మంలో ఇళ్ళన్నీ మునిగిపోయాయి. ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా జలమయ్యాయి. దీని వలన ప్రజలు ఎక్కడికి వెళ్లలేక.. తినడానికి తిండి, తాగడానికి నీరు కూడా లేక చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడిప్పుడే ప్రజలు కోలుకుంటున్నారు. అయితే, వరద బాధితుల కోసం తెలుగు సినీ సెలబ్రిటీలు, ప్రముఖులు ఇలా ఎంతో మంది రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి విరాళాలు భారీగా ఇస్తున్నారు.
ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మన హీరోలు ప్రజలకు సహాయం చేయడంలో ముందుంటారు. ఇతర రాష్ట్రాల్లో ఏదైనా జరిగినా మన హీరోలు స్పందిస్తారు. కానీ, తెలుగు రాష్ట్రాల్లో ఏమైనా జరిగితే బయటి రాష్ట్రాల వారు ఎవ్వరూ కూడా సహాయం చేయరు. అయితే, తాజాగా తమిళ హీరో శింబు వరదలలో చిక్కుకున్న భాదితుల కోసం రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి భారీ విరాళం ఇచ్చాడు. శింబు తెలుగులో వల్లభ, మన్మధ.. లాంటి మూవీస్ చేసిన విషయం మనకు సంగతి తెలిసిందే. మూడు లక్షల చొప్పున మొత్తం ఆరు లక్షలు విరాళంగా ప్రకటించారు. దీంతో తెలుగు శింబు అభిమానులు అభినందిస్తున్నారు.
- Tags
- Simbu
- hero simbu