నార్త్ కాదు.. సౌత్ అభిమానుల ప్రేమే గొప్పది.. తమన్నా

by Nagaya |
నార్త్ కాదు.. సౌత్ అభిమానుల ప్రేమే గొప్పది.. తమన్నా
X

దిశ, సినిమా: స్టార్ నటి తమన్నా భాటియా నార్త్ అండ్ సౌత్ అభిమానుల మధ్య చాలా తేడాలున్నాయంటోంది.అంతేకాదు ఈ రెండు ఇండస్ట్రీల ఫ్యాన్స్ మధ్య విభేదాలు కూడా ఉన్నట్లు అంగీకరిస్తానంది. తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆమె.. 'దక్షిణాది ప్రేక్షకులు విశ్వాసపాత్రులని, కళాకారులకు సంబంధించిన భావోద్వేగాలను వాళ్లు కూడా అనుభవిస్తారని చెప్పింది. అలాగే సౌత్ స్టార్స్ - ఫ్యాన్స్ మధ్య సంబంధం తెర వరకు మాత్రమే పరిమితం కాకుండా నిజజీవితంలోనూ వ్యక్తిగత అనుబంధాలు ఏర్పరచుకుంటారని వెల్లడించింది. ఇక బాలీవుడ్‌తో పాటు, ఉత్తర భారతదేశానికి చెందిన నటులు వారి అభిమానులతో రిలేషన్ పెంపొందించడానికి చాలా సమయం తీసుకుంటారన్న తమన్నా.. స్టార్స్‌ను ఎంతో ఇష్టపడతామని చెప్పే అభిమానులు సైతం హఠాత్తుగా తమ నిర్ణయాన్ని మార్చుకోవడం గమనించానని చెప్పింది.

Advertisement

Next Story