- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'అజా' ఫ్యాషన్స్ షోరూమ్‌ను ప్రారంభించిన మిల్కీ బ్యూటీ!
దిశ, సినిమా: లగ్జరీ రీటైలర్‌లో అగ్రగామిగా పేరుగాంచిన 'అజా' ఫ్యాషన్స్ హైదరాబాద్‌లో సరికొత్త షోరూమ్‌ని ప్రారంభించింది. ఈ షాప్ ప్రారంభోత్సవానికి అతిథిగా వచ్చిన స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా, పింకీ రెడ్డి కలిసి రిబ్బన్ కట్ చేశారు. ఈ మేరకు మాట్లాడిన తమన్న.. 'హైదరాబాద్‌లో సరికొత్త అజా స్టోర్ ప్రారంభోత్సవానికి వచ్చినందుకు సంతోషిస్తున్నా. నన్ను ఆహ్వానించినందుకు డాక్టర్ అల్కా నిషార్, దేవాంగి పరేఖ్‌కు ధన్యవాదాలు.
అధునాతనమైన ఈ స్టోర్ హైదరాబాద్‌లోని లగ్జరీ షాపర్లకు గొప్ప షాపింగ్ అనుభూతిని కలిగిస్తుంది' అని చెప్పింది. అలాగే కార్యక్రమంలో మాట్లాడిన అజా వ్యవస్థాపకుడు, చైర్పర్సన్ డాక్టర్ అల్కా నిషార్.. 'బంజారాహిల్స్‌లో అజా స్టోర్‌ను ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది. భాగ్యనగరంలో నివసించే స్త్రీ, పురుషుల కోసం డిజైనర్ దుస్తులు, నగలు, యాక్సెసరీస్‌తో వన్ స్టాప్ షాపింగ్ స్టోర్‌ని ప్రారంభించాం. దేశవ్యాప్తంగా ఉన్న అత్యంత ప్రతిభావంతులైన డిజైనర్లు రూపొందించిన అత్యద్భుతమైన హస్తకళలను మేం అందుబాటులోకి తీసుకొస్తున్నాం' అన్నారు. మరింత సమాచారం కోసం www.azafashions.comని సందర్శించండి.