‘లస్ట్ స్టోరీస్ 2’లో లస్ట్ లేదంటున్న తమన్నా.. మరి దేనికోసం చూడాలంటున్న కుర్రాళ్లు

by sudharani |   ( Updated:2023-06-30 15:13:09.0  )
‘లస్ట్ స్టోరీస్ 2’లో లస్ట్ లేదంటున్న తమన్నా.. మరి దేనికోసం చూడాలంటున్న కుర్రాళ్లు
X

దిశ, సినిమా: ‘లస్ట్ స్టోరీస్ 2’ డ్రామాను ఫ్యామిలీతో కలిసి చూడాలని కోరుతోంది తమన్నా. ఆమె నటించిన ఈ వెబ్ సిరీస్ జూన్ 29న నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారం కానుంది. ఈ మేరకు ప్రచారంలో భాగంగా ఈ సిరీస్‌ స్టోరీ గురించి చెబుతూ ట్విట్టర్ వేదికగా ఓ వీడియో పోస్ట్ చేసింది తమన్నా. ‘‘లస్ట్ స్టోరీస్ 2’ ఎన్నో రకాల భావోద్వేగాలతో కూడిక కలయిక. టైటిల్‌లో ఉన్న లస్ట్ అనే పదం చూసి మోసపోవద్దు. ఇందులో అమ్మ, బామ్మ, వదినతోపాటు పనిమనిషి ప్రేమను కూడా అద్భుతంగా చూపించారు. ఇది చూస్తున్నపుడు ఎవరొచ్చినా ఆందోళన చెందకుండా అలాగే కంటిన్యూ చేయండి. అందరితో కలిసి హాయిగా వీక్షించండి. కలిసిచూస్తే తుఫాన్ ఏమీ రాదు. ఆకాశం ఉడి కిందపడదు. వైఫై కనెక్షన్ ఆగిపోదు. భయపడకుండా ప్రశాంతంగా చూడండి’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా.. ‘పాప మేము చూసేదే లస్ట్ కోసం.. అలాంటిదే లేనప్పుడూ మేము ఎందుకు చూడాలి’ అంటూ కుర్రాళ్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.

Read More: అలాంటి డ్రెస్‌లో మెరిసిన తమన్నా.. విజయ్ నాటీ కామెంట్స్ వైరల్.

Advertisement

Next Story