నా తమన్నాతో తిరుగుతూ చాలా బుద్ది చెప్పావ్.. నటుడి కామెంట్స్ వైరల్

by Hamsa |   ( Updated:2023-05-19 13:25:56.0  )
నా తమన్నాతో తిరుగుతూ చాలా బుద్ది చెప్పావ్.. నటుడి కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్టార్ హీరోల సరసన నటించి తన అందాలతో స్టార్‌గా రాణిస్తోంది. అయితే తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్‌లో ఉన్నట్లు కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఇటీవల ఈ ఇద్దరు కలిసి డిన్నర్ చేయడానికి ఓ హోటల్‌కు వెళ్ళి కారులో వెళ్తుండగా కనిపించడంతో డేటింగ్ పుకార్లకు బలం చేకూరినట్లు అయింది.

తాజాగా, వీరిద్దరి డేటింగ్ వ్యవహారంపై నటుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. విజయ్ వర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘దహాద్’ వెబ్‌సిరీస్ టీజర్‌ను పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన నటుడు గుల్షన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘ నా తమన్నాతో నువ్వు తిరుగుతున్నావ్. నాకు సరైన బుద్ధి చెప్పావ్ విజయ్. ఇంకా నా పరువు తీయనందుకు నీకు చాలా థ్యాంక్స్. లేకపోతే ఏం జరిగేదో హే రామ్’’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో గుల్షన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story