Varalaxmi Sarathkumar : ఫిల్మ్ ఇండస్ట్రీలో అలాంటి వాళ్లకు విలువ లేదు

by Prasanna |   ( Updated:2023-02-15 09:07:45.0  )
Varalaxmi Sarathkumar : ఫిల్మ్ ఇండస్ట్రీలో అలాంటి వాళ్లకు విలువ లేదు
X

దిశ, సినిమా: టాలెంట్ ఉన్న నటీనటులకు తమిళ సినీ ఇండస్ట్రీలో సరైన ఆదరణ లేదంటోంది వరలక్ష్మి శరత్‌ కుమార్‌. ఆమె నటించిన తాజా చిత్రం 'కొండ్రాల్‌ పావం' మార్చి 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న నటి.. 'ఇందులో మల్లిక అనే పాత్రలో నటించాను. విభిన్నమైన చిత్రం చేసినందుకు సంతోషంగా ఉంది. తెలుగు ప్రేక్షకుల ఆదరణతోనే వరుస ఆఫర్లు వస్తున్నాయి. తెలుగు చిత్రాల్లో నేను పోషించే ప్రతి పాత్రను ఇష్టపడుతున్నారు. గౌరవంతో పాటు ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఆ తరహా ఆదరణ కనిపించలేదు. అందుకే హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అవ్వాలని ఆలోచిస్తున్నా. నెగటివ్ పాత్రలు ఎక్కువగా చేస్తున్నాననే విమర్శలు వస్తున్నప్పటికీ ఆందోళన చెందట్లేదు. నిజం చెప్పాలంటే ఇతర నటీమణులు ఆశ్చర్యపోయే పాత్రల్లోనే నటించానని గొప్పగా ఫీల్ అవుతున్నా' అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి : Bollywood : పెళ్లికి ముందే గర్భం దాల్చిన కియారా.. ట్రెండ్ ఫాలో అయిందట?

Advertisement

Next Story