మగాళ్లకే కాదు.. మహిళల్లోనూ చాలా షేడ్స్ ఉంటాయి: తాహిరా

by Anjali |   ( Updated:2023-04-25 10:38:27.0  )
మగాళ్లకే కాదు.. మహిళల్లోనూ చాలా షేడ్స్ ఉంటాయి: తాహిరా
X

దిశ, సినిమా: మహిళా రచయితలు, దర్శకులకు మరింత ప్రోత్సాహం అందించాలంటోంది తాహిరా కశ్యప్ ఖురానా. తాను కూడా అతివల చుట్టూ తిరిగే కథలకు దూరంగా ఉండాలనే ఒత్తిడిలో కూరుకుపోయినప్పటికీ తీర్పు చెప్పడంలో కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. ‘నేను చెప్పాలనుకున్న కథలు చాలా ఉన్నాయి. కొంతమంది నా దగ్గరకు వచ్చి.. ‘మీరు అమ్మాయిల నగ్నత్వం గురించి మాత్రమే రాస్తారు. దాని గురించే మాట్లాడతారు’ అని చెప్పారు.

కానీ వాళ్లంతా స్త్రీత్వంలోని వివిధ కోణాల గురించి మాట్లాడే కథనాలను చూడలేదని భావిస్తున్నా. అందుకే ఎన్ని ఫిమేల్ సెంట్రిక్ కథలు చెప్పినా తక్కువే అనిపిస్తుంది’ అని తెలిపింది. అలాగే తెరపై నలుపు, తెలుపులు మాత్రమే కాదు స్త్రీకి చాలా షేడ్స్ ఉన్నాయన్న దర్శకురాలు.. ‘మగవాళ్ల క్యారెక్టర్లను తీర్చిదిద్దినంత అందంగా మహిళలను చూపించలేదు. దానికి బెస్ట్ ఉదాహరణ జోకర్. పురుషుల క్యారెక్టర్ భావోద్వేగాలతో నిండివుంటే.. స్త్రీల పాత్రలు సాదాసీదాగా ఉంటాయి’ అని అభిప్రాయపడింది తాహిరా కశ్యప్.

Also Read: నిహారికకు నాగబాబు రెండో పెళ్లి ఫిక్స్ చేశారా?


Advertisement

Next Story