- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నాకెప్పుడూ అలాంటి క్యారెక్టర్లే ఇచ్చేవాడు: డైరెక్టర్‌పై టబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, సినిమా: సీనియర్ నటి టబు 'కుత్తే' చిత్రంలో భాగమైనందుకు సంతోషంగా ఉందంటోంది. అర్జున్ కపూర్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఫిల్మ్ ఇటీవల ఓటీటీలో విడుదలై పాజిటీవ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఓ సమావేశంలో పాల్గొన్న ఆమె ఈ చిత్రంలో తను పోషించిన పోలీసు అధికారి పాత్రతో పాటు 'దృశ్యం-2'లో 'మీరా దేశ్‌ముఖ్' క్యారెక్టర్ అభిమానుల మనసు దోచుకున్నట్లు చాలామంది చెప్పారని తెలిపింది.
అలాగే దర్శకుడు ఆస్మాన్ భరద్వాజ్‌ను భిన్నమైన ఫిల్మ్‌మేకర్‌గా పేర్కొన్న నటి.. ఆస్మాన్ కూడా తండ్రి విశాల్ భరద్వాజ్ మాదిరిగానే ఆలోచించినప్పటికీ పనిచేసే విధానం కొత్తగా ఉంటుందని చెప్పింది. 'గతంలో విశాల్జీ నాకు క్లిష్టమైన పాత్రలు ఇచ్చేవాడు. అయినప్పటికీ ఆయనతో పనిచేసేటప్పుడు ఫ్రీగా అనిపించేది. మిగతావాళ్లతో పోలిస్తే ఆయనతో నాకున్న క్రియేటివ్ బాండింగ్ ప్రత్యేకమైనది. ఇప్పుడు ఆస్మాన్తోనూ అంతే. 'కుత్తే'లో నా పాత్రను అందరూ ప్రేమించేలా తీర్చిదిద్దాడు. నేను దాన్ని ఇష్టంగా చేశా' అంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది.
READ MORE