పెళ్లి వార్తలపై స్పందించిన తాప్సీ.. అసలు విషయం చెప్పి షాక్ ఇచ్చిన బ్యూటీ..!

by sudharani |   ( Updated:2024-02-28 13:09:14.0  )
పెళ్లి వార్తలపై స్పందించిన తాప్సీ.. అసలు విషయం చెప్పి షాక్ ఇచ్చిన బ్యూటీ..!
X

దిశ, సినిమా: తాప్సీ పన్ను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది. ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ‘డంకీ’ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా తాప్సీ పెళ్లిపై నెట్టింట వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వీటిపై స్పందించింది ఈ బ్యూటీ.

తాప్సీ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్‌తో దాదాపు పదేళ్ల నుంచి ప్రేమలో ఉంది. ఇటీవలె తమ రిలేషన్‌పై ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టి అప్పటి నుంచి వార్తల్లో నిలిచింది ఈ అమ్మడు. ఈ క్రమంలోనే మార్చి నెలాకరులో ఉదయపూర్‌లోని అట్టహాసంగా తాప్సీ తన ప్రియుడుని పెళ్లి చేసుకోబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై తాజాగా స్పందించిన ఈ అమ్మడు. ‘నా వ్యక్తి గత జీవితానికి సంబంధించిన నేను ఎప్పుడూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. భవిష్యత్తులోనూ ఇవ్వను’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో తన పెళ్లి వార్తలపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టినట్లైంది.

Advertisement

Next Story

Most Viewed