సమంతకు వెల్లువెత్తిన సింపతి.. ఎంగేజ్‌మెంట్ రోజే నాగచైతన్య, శోభితలకు బిగ్ షాక్..దుమ్మెత్తిపోస్తున్న జనాలు

by Kavitha |
సమంతకు వెల్లువెత్తిన సింపతి.. ఎంగేజ్‌మెంట్ రోజే నాగచైతన్య, శోభితలకు బిగ్ షాక్..దుమ్మెత్తిపోస్తున్న జనాలు
X

దిశ, సినిమా: నాగచైతన్య సమంత పెళ్లి చేసుకుని కొంత కాలం సంతోషంగా జీవించిన తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత నాగచైతన్య శోభిత దూళిపాళ్లతో లవ్‌లో ఉన్నాడని ఆమెతో డేటింగ్ చేస్తున్నాడని పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేశాయి. అంతేకాకుండా నాగచైతన్య సమంత విడిపోవడానికి శోభిత ధూళిపాళ కారణం అంటూ కూడా నెటిజెన్స్ పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా చేశారు. అయితే ఇప్పుడు ఆ రూమర్స్‌కు బలాన్ని చేకూరుస్తూ నాగచైతన్య ఆమెతోనే ఎంగేజ్మెంట్ చేసుకొని ఊహించని విధంగా అందరికీ షాక్ ఇచ్చాడు. ఇక నిశ్చితార్థం అయినప్పటి నుంచి సమంత పైన విపరీతమైన సింపతి పెరిగి పోయింది. నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చి శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకోవడం పైన నెటిజన్లు భగ్గుమంటున్నారు.

అలాగే శోభితతో నాగచైతన్య ఎంగేజ్మెంట్ ఫోటోలను చూస్తున్న నెటిజన్లు సమంతకు అన్యాయం జరిగిందని గగ్గోలు పెడుతున్నారు.. ఇట్లా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడో లేదో అలా నాగ చైతన్య , శోభితలు పెద్ద ఎత్తున ట్రోలింగుకు గురవుతున్నారు. అలాగే వీరిద్దరీ ఎంగేజ్మెంట్‌తో సమంత హార్ట్ బ్రేక్ అయి ఉంటుందని నాగచైతన్య.. శోభితతో కలిసి సమంతను మోసం చేశాడని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. తమదైన శైలిలో నాగ చైతన్యకు కౌంటర్ వేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisement

Next Story