భారత్‌లో భయానక వాతావరణం.. కళలు అంతమైపోతాయన్న నటి

by Hajipasha |
భారత్‌లో భయానక వాతావరణం.. కళలు అంతమైపోతాయన్న నటి
X

దిశ, సినిమా: భారతీయ నటులంతా 'బాయ్‌కాట్' అనే భయానక వాతావరణంలో జీవిస్తున్నారంటోంది స్వరా భాస్కర్. అంతేకాదు ఏదైనా నిర్భయంగా ఫేస్‌బుక్ పోస్ట్ పెడితే డైరెక్ట్ జైలుకు పంపించే దేశంలో ఉన్నామంటూ ఆవేదన వ్యక్తం చేసింది. 'స్వేచ్ఛను పరిమితం చేసి భయానక వాతావరణాన్ని ఎంత ఎక్కువగా సృష్టిస్తారో.. అక్కడ కళ, సంస్కృతి, వినోదం, కళాత్మక ప్రదర్శనలు దెబ్బతింటాయి. భయాందోళనతో ఉన్నతమైన కళను క్రియేట్ చేయలేం. ఇలాంటి పరిస్థితులు మారాలి. గత కొన్నేళ్లుగా సినిమా సెట్‌లపై, దర్శకులపై దాడులు జరుగుతున్నాయి. దీంతో సినిమా నిర్మాతలే కాదు యావత్ ప్రజానీకం భయపడుతోంది.

కళ ఏ ఒక్క ప్రదేశానికి సంబంధించినది కాదు. కాబట్టి ఓపెన్ మైండ్‌తో రూపొందించే కళాత్మక ప్రక్రియపై బహిష్కరణ సంస్కృతి ప్రభావితం చేయబోతోంది. అదే సమయంలో వివిధ మార్గాల్లో విభిన్న స్వరాలు బయటకు వస్తాయి. అప్పుడు ఖచ్చితంగా 100 శాతం నేను కూడా ధైర్యంగా నిలబడతా' అంటూ ఇండస్ట్రీపై కొనసాగుతున్న 'బాయ్ కాట్' వివాదంపై తన అభిప్రాయాలను వెల్లడించింది.

Advertisement

Next Story