Swara Bhaskar: నాలుగు రోజుల్లోనే సోదరుడు భర్తగా మారిపోయాడా?

by Prasanna |   ( Updated:2023-02-18 07:13:40.0  )
Swara Bhaskar: నాలుగు రోజుల్లోనే సోదరుడు భర్తగా మారిపోయాడా?
X

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ స్వరా భాస్కర్.. పొలిటికల్ యాక్టవిస్ట్ ఫహాద్ అహ్మద్‌తో కోర్టు మ్యారేజ్ చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చింది. అతన్ని మిస్ కాకూడదనే ఉద్దేశంతోనే ఇంత త్వరగా పెళ్లి చేసుకున్నానని చెప్పి్ంది. ఫిబ్రవరి 6న కోర్టుకు డాక్యుమెంట్స్ అందజేసిన జంట.. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఫిబ్రవరి 16న పెళ్లి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేశారు. అయితే స్వరా భాస్కర్ ఫిబ్రవరి 2న ఫహాద్‌కు ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెస్ చెప్తూ.. అన్న(భాయ్)గా సంబోధించింది. దీంతో ఈ ట్వీట్‌ను వైరల్ చేస్తున్న నెటిజన్స్.. 'నాలుగు రోజులకే భాయ్‌ను భర్తను చేశావా?' అని తిట్టిపోస్తున్నారు. సోదరుడిగా అంగీకరించిన వ్యక్తితో మ్యారేజ్ చేసుకునే ఆలోచన ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Next Story