- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రముఖ నటుడు అనుమానాస్పద మృతి.. కారులో దొరికిన డెడ్‌బాడీ..

X
దిశ, సినిమా: ప్రముఖ మలయాళ నటుడు వినోద్ థామస్ (45) కన్నుమూశాడు. కొట్టాయం సమీపంలో పాంపడిలోని ఓ హోటల్ పార్కింగ్ ఏరియాలో ఉన్న కారులో పడిపోయి ఉన్న థామస్ ని చూసి అనుమానంతో అక్కడి హోటల్ మెనేజ్‌మెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారు అద్దాలు బద్దలు కొట్టి చూడగా అందులో వినోద్ థామస్ డెడ్ బాడీ కనిపించినట్లు సమాచారం. కాగా విషవాయువులు పీల్చడం వల్లే ఆయన కన్నుమూసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక థామస్ సినిమాలతో పాటు మలయాళంలో పలు టీవీ సీరియల్స్, షార్ట్ ఫిలిమ్స్‌లలో నటించాడు. అంతేకాదు స్టేజ్ సింగర్‌గా కూడా ఆయనకు మలయాళంలో మంచి పేరు ఉంది. రీసెంట్ గా రిలీజైన ‘భగవాన్ దసంతే రామ్‌రాజ్యం’ సినిమాలో కూడా వినోద్ థామస్ కీలక పాత్రలో నటించాడు.
Next Story