- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విక్రమ్ మూవీపై నెట్‌ఫ్లిక్స్ పంతం.. రిలీజ్ కష్టమే అంటూ వార్తలు?
దిశ, సినిమా: చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘తంగలాన్’. పీరియాడిక్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీకి పా రంజిత్ దర్శకత్వం వహించాడు. నీలమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఆగస్టు 15న తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో థియేటర్స్‌లో విడుదలై మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ప్రజెంట్ ఈ మూవీ ఓటీటీ గురించి ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
అయితే.. ఈ సినిమా ఎక్స్‌పెక్ట్ చేసినంత సక్సెస్‌ను అందుకోకపోవడంతో ‘తంగలాన్’ ఓటీటీ డీల్‌ను నెట్‌ఫ్లిక్స్ క్యాన్సిల్ చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ముందుగా ఒప్పందం చేసుకున్న మొత్తానికి కాకుండా తక్కువకే ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఇవ్వాలని ప్రముఖ నిర్మాణ సంస్థను నెట్‌ఫ్లిక్స్ డిమాండ్ చేసినట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ, ప్రొడ్యూసర్లు దీనికి ఒప్పుకోకపోవడం ఓటీటీ డీల్‌ను నెట్‌ఫ్లిక్స్ రద్దు చేసుకున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్. ఇక ఓటీటీ రిలీజ్ విషయంలో నెట్‌ఫ్లిక్స్ పంతం పట్టడంతో.. ఈ చిత్రాన్ని మరో ఓటీటీలో రిలీజ్ చేయాలని చూస్తున్నారట చిత్ర బృందం. దీంతో ‘తంగలాన్’ ఓటీటీ రిలీజ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా.. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘తంగలాన్’ రూ. 70 కోట్ల లోపే కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.