ఐదుగురితో డేటింగ్, మూడుసార్లు పెళ్లి.. అయినా అసంతృప్తే!

by Nagaya |
ఐదుగురితో డేటింగ్, మూడుసార్లు పెళ్లి.. అయినా అసంతృప్తే!
X

దిశ, సినిమా : సుస్మితా సేన్ దాదాపు ఐదుగురితో డేటింగ్ చేయడమే కాక మూడు సార్లు పెళ్లి వార్తలతో సంచలనంగా మారింది. అయితే వీరందరి వివరాలు పెద్దగా ఎవరికీ తెలియనప్పటికీ చివరి ప్రేమికుడు రోహ్మన్ షాల్‌ మాత్రం ప్రపంచానికి పరియచమయ్యాడు. వీరిద్దరూ ఒకరినొకరు పిచ్చిగా ప్రేమించుకోవడంతో మ్యాటర్ పెళ్లిపీటల వరకు వచ్చింది. కానీ, చివరకు అందరిలాగే అతన్ని కూడా వదిలేసిన సుస్మిత.. తన జీవితంలో విభిన్న ఆలోచనలున్న పురుషులను కలిశానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఓ కార్యక్రమంలో భాగంగా పిల్లలే పెళ్లికి అడ్డుగా ఉన్నారా? అనే వార్తలపై స్పందిస్తూ.. 'అదృష్టవశాత్తు నా జీవితంలో గమ్మత్తయిన పురుషులు అడుగుపెట్టారు. అయితే వాళ్లంతా నన్ను నిరుత్సాహపరచడం వల్లే పెళ్లి చేసుకోలేదు. దీనికి నా పిల్లలతో సంబంధం లేదు. ఎప్పుడూ నా పట్ల దయతో ఉంటారు. నేను డేటింగ్ చేసిన వ్యక్తులను ముక్తకంఠంతో అంగీకరించారు. వాళ్ల ముఖం చూడపోయినా అందరికీ సమానమైన ప్రేమ, గౌరవం ఇచ్చారు. నిజంగా ఇది ఆనందించదగ్గ అందమైన విషయం' అంటూ అసలు విషయం చెప్పేసింది.

Advertisement

Next Story