ఇండస్ట్రీలో స్త్రీలు భయపడే రోజులు పోయాయ్.. సుస్మిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Prasanna |   ( Updated:2023-08-16 12:22:46.0  )
ఇండస్ట్రీలో స్త్రీలు భయపడే రోజులు పోయాయ్.. సుస్మిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా : ఇటీవల ‘తాలీ’లో ట్రాన్స్‌జెండర్‌గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటి సుస్మిత సేన్.. ఇండస్ట్రీలో మహిళలు, అవకాశాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. ‘సినిమా అవకాశాలకు వయసుతో సంబంధం ఉండదు. గతంలో కంటే ఇప్పుడు పరిశ్రమలో చాలా మార్పులొచ్చాయి. ఇంతకుముందు 30 దాటిన స్త్రీలు అవకాశాలు తగ్గుతాయని చాలా భయపడేవారు. కానీ ఇప్పుడు అలా భయపడాల్సిన అవసరం లేదు. అలాగే నేను చేసే ప్రతి క్యారెక్టర్ ఛాలెంజింగ్‌గా ఉండాలని కోరుకుంటా. ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తిండిపోవాలి. దానికోసం ఎంతైనా కష్టపడతా. ‘తాలీ’లో నా పాత్ర అందరినీ ఆకట్టుకుంది. ఈ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇక ఇటీవల నాకు వచ్చి హార్ట్ ఎటాక్ వల్లే నా జీవితంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే ధైర్యం వచ్చింది’ అంటూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

Read More : Tamannaah Bhatia : తమన్నా ఆస్తి ఎంత ఉంటుందో తెలుసా?

భర్త బర్త్ డే స్పెషల్.. సెమీ న్యూడ్ లుక్‌లో హీటెక్కించిన కరీన

Advertisement

Next Story