మళ్లీ ఒక్కటైన మాజీ ప్రియులు.. ఫొటోలు వైరల్

by sudharani |   ( Updated:2022-10-23 12:09:46.0  )
మళ్లీ ఒక్కటైన మాజీ ప్రియులు.. ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా : బాలీవుడ్ నటి సుస్మితా సేన్ ప్రేమ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల లలిత్ మోడీతో ప్రేమలో పడ్డ ఆమె అతితక్కువ సమయంలోనే తనకు దూరమైనట్లు తెలుస్తుండగా.. మళ్లీ మాజీ బాయ్‌ఫ్రెండ్ రోహ్మన్ షాల్‌తో రీ కనెక్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే వీరిద్దరూ ఇటీవల చాలా సార్లు కలుసుకున్నట్లు నెట్టింట ప్రూఫ్స్ హల్ చల్ చేస్తుండగానే తాజాగా మరోసారి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు నెటిజన్లు. రీసెంట్‌గా జరిగిన డాక్టర్ హృషికేష్ పాయ్- రిష్మా పాయ్ కూతురు అన్విషా వివాహానికి.. సుస్మిత తన కూతుర్లతో రాగా, రోహ్మన్ షాల్‌ కూడా అంటెడ్ అయ్యాడు. ఈ క్రమంలోనే సుస్మిత పిల్లలతో సందడి చేస్తూ ఫొటోలకు పోజులిచ్చిన ఆయన.. ఓ గ్రూప్ ఫొటోలో సుస్మిత పక్కనే నిలబడటం విశేషం. దీంతో వీరిద్దరి సంబంధం మళ్లీ బలపడిందంటూ ఫ్యాన్స్ పుకార్లకు ఆజ్యం పోస్తుండగా.. ప్రస్తుతం ఈ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి : అతన్ని చిన్నపిల్లాడిలా చూస్తే కోపం వస్తుంది: షెఫాలీ

Advertisement

Next Story