బాలీవుడ్ ఇండస్ట్రీ Sushant Singh ను చంపేసింది: మీతూసింగ్ పోస్ట్ వైరల్

by sudharani |   ( Updated:2023-01-21 13:18:38.0  )
బాలీవుడ్ ఇండస్ట్రీ  Sushant Singh ను చంపేసింది: మీతూసింగ్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా : నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణంపై తన సోదరి మీతూ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఐఐటి బాంబేలో సుశాంత్ మాట్లాడుతున్న పాత వీడియోను నెట్టింట షేర్ చేస్తూ కన్నీటి పర్యంతమైన ఆమె.. తన సోదరుడిని బాలీవుడ్ చంపేసిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. 'ఈ బాలీవుడ్‌ను నాశనం చేయడానికి సుశాంత్ మరణ బ్రహ్మాస్త్రం సరిపోతుంది. ప్రతి ఒక్కరూ సుశాంత్‌ను మేధావిగా గుర్తిస్తారు.

కానీ అతడు పనిచేసిన సొంత పరిశ్రమ బాలీవుడ్ మాత్రం ఇందులో విఫలమైంది. అసూయ, అభద్రతతోనే సుశాంత్‌ను చంపింది. నిజంగా ఇదొక పెద్ద విషాదం. నా ఏకైక యువరాజుకి ఇటీవల హృదయపూర్వక నివాళి అందించిన స్వదేశీ యూట్యూబర్ 'ప్యూడీపీ' (ఫెలిక్స్)కి నిజంగా కృతజ్ఞురాలిని. నా సోదరుడిని మెచ్చుకోవడం, ఆదర్శంగా తీసుకోవడం చూస్తే గొప్ప బహుమతి కలుగుతోంది. ఇప్పుడు సుశాంత్ ప్రతి ఇంట్లో నివసిస్తున్నాడు. ప్రతి కుటుంబం అతన్ని సొంత కొడుకులా స్వీకరించి న్యాయపోరాటం చేస్తోంది' అంటూ పోస్టులో రాసుకొచ్చింది.

Advertisement

Next Story